ప్రత్తిపాడు: కాకినాడ ఆవేల్తి గ్రామంలో పులి సంచారం: పశువులపై దాడి, ఒకటి మృతి
కాకినాడ జిల్లా శంఖవరం మండలం ఆవేల్తి గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. రైతు గోము రాంబాబుకు చెందిన రెండు పశువులపై దాడి జరగగా, ఒకటి మృతి చెందింది. ఘటనపై రేపు ఉదయం అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టనున్నారు.