ఒంగోలు అర్బన్: హర్ ఘర్ తిరంగా ర్యాలీ లో పాల్గొన్న ఎస్పీ పోలీస్ సిబ్బంది
Ongole Urban, Prakasam | Aug 13, 2026
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని జాతీయ జెండాలను చేతబట్టి దేశభక్తిని చాటారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, జాతీయ జెండా మనందరి గర్వానికి ప్రతీక అని, దేశ ఐక్యతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. తిరంగా ర్యాలీలో అధికారులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు.హర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో ప్రజల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత భావాన్ని మరింతగా పెంపొందించాలని అన్నారు