ఒంగోలు అర్బన్: స్పెషల్ పోలీసులము అని చెప్పి బంగారాన్ని దొంగలిస్తున్న దొంగలతో అప్రమత్తంగా ఉండాలన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Sep 13, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో స్పెషల్ పోలీసులను అని చెప్పి అవగాహన కల్పిస్తూ నటించి వృద్ధుల వద్ద నుంచి మహిళల వద్ద నుంచి గుర్తుతెలియని ఇద్దరి యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి బంగారాన్ని అపహరిస్తున్నారని ఈ విషయాన్ని ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలని ఎస్పి హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఎవరైనా అలా పోలీసులము అని చెప్పి నమ్మించినట్లయితే 9121102266 నంబర్ కు సమాచారం అందించి సహకరించాలని ఎస్పీ కోరారు.