కందుకూరు నియోజకవర్గం కరేడు మండలంలో ఉన్న8400 ఎకరాల భూములు కాపాడాలని సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య కోరారు. నెల్లూరు సీపీఐకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.కరేడు భూముల విషయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఒక మాట, వచ్చాక ఇంకో మాట చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎకరా రూ. కోటి ఉన్న భూములను రూ. 20 లక్షలకే ఇండో సోల్ కంపెనీకి కట్టబెట్టడం దారుణమన్నారు. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగింది.