నందికోట్కూరు: మల్యాల పంప్ హౌస్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని మల్యాల పంప్ హౌస్ ను కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు పంప్ హౌస్, ఫోర్ బే, లింక్ ఛానల్ ద్వారా హంద్రీనీవా కాలువలోకి పారుతున్న నీటి సరఫరా తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం మూడు పంపుల ద్వారా రోజుకు 920 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు 21 టీఎంసీల నీటిని సరఫరా చేశామని ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు