అదిలాబాద్ అర్బన్: మహాలక్ష్మివాడలో ఘనంగా 'పోలీస్ మీకోసం' కార్యక్రమం: పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్
మహాలక్ష్మివాడ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన 'పోలీస్ మీకోసం' కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ, భద్రత, రోడ్డు నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు క్రీడా పోటీలు నిర్వహించారు. అలాగే, కొత్తగా ఏర్పాటు చేసిన 17 సీసీటీవీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు.