కనిగిరి: బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వెయ్యాలి: కనిగిరి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ తమిమ్ అన్సారియా ఆదేశం
కనిగిరి పట్టణంలోని పవిత్ర ఫంక్షన్ హాల్ నందు బంగారు బాల్యం కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ తమిమ్ అన్సారియా బుధవారం బంగారు బాల్యం పై జరిగిన సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో బాల్యవివాహాలు జరగకుండా అధికారులు అడ్డుకోవాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చర్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ద్వారా అందే సంక్షేమ పథకాలు బాలలకు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.