పటాన్చెరు: పటాన్చెరులో జోరందుకున్న గణనాథుల విక్రయాలు: కళకళలాడుతున్న ప్రధాన రహదారులు
పటాన్చెరులో వినాయక చవితి సందడి మొదలైంది. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన గణనాథుల విగ్రహాల విక్రయాలు జోరందుకున్నాయి. పండగ వాతావరణంతో పటాన్చెరు ప్రాంతం కళకళలాడుతోంది.