వనపర్తి: వనపర్తిలో పెరిగిన నిఘా: 2,221 సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత
వనపర్తి జిల్లాలో ప్రజల భద్రత కోసం 2,221 సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు పట్టణాలు, గ్రామాలు మరియు ప్రధాన కూడళ్లలో నిరంతర నిఘా కొనసాగుతుందని ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. నేర నియంత్రణ, దర్యాప్తునకు ఈ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వెల్లడించారు.