బనగానపల్లె: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో బనగానపల్లె విద్యార్థుల ప్రతిభ
జాతీయ స్థాయిలో బనగానపల్లె విద్యార్థుల సత్తా జాతీయ స్థాయి కరాటే పోటీల్లో బనగానపల్లెకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం అభినందనీయమని పట్టణ మాజీ సర్పంచ్, అరుణ భారతి సాహితీ సంస్థ అధ్యక్షుడు బీసీ రాజారెడ్డి అన్నారు. 10-11 ఏళ్ల బాలికల విభాగంలో దీత్య స్వర్ణ పతకం, 8-9 ఏళ్ల బాలుర విభాగంలో నాగ సాత్విక్ శర్మ రజత పతకం, 8-9 ఏళ్ల బాలికల విభాగంలో నిహార రజత పతకం, 8-9 ఏళ్ల బాలికల విభాగంలో తేజ కాంస్య పథకం సాధించారు.