కరీంనగర్: హరిశంకర్ ఆరోపణలను ఖండించిన కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్లు
కరీంనగర్ బీజేపీ పాలకవర్గంపై చల్ల హరిశంకర్ చేసిన ఆరోపణలను కార్పొరేటర్లు బండారి వేణు, సోమిడి వేణు ఖండించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ హితబోధను వక్రీకరించి మాట్లాడుతున్నారని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.