భీమిలి: కొమ్మాది జంక్షన్ వద్ద రహదారి మధ్యలో ఉన్న రైలింగ్ పైకి దూసుకెళ్లిన కారు, తప్పిన పెను ప్రమాదం
కొమ్మాది జంక్షన్ ముందు కారు వేగంగా వచ్చి రైలింగ్ పైకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఒక వంద మీటర్లు ముందు వెళితె చాలా పెద్ద ప్రమాదమే జరిగిఉండేది అని స్థానికులు తెలిపారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలను మల్లించారు. స్థానికుల సహాయంతో కారును రహదారి పక్కకు తీయించారు.