గుంతకల్లు: విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని విరమించుకోవాలి: గుత్తిలో సీపీఐ మండల కార్యదర్శి రామదాసు
విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని విరమించుకోవాలని, అంతేకాకుండా ప్రస్తుతం ఏర్పాటు చేసిన మీటర్లను కూడా తొలగించాలని సీపీఐ మండల కార్యదర్శి రామదాసు డిమాండ్ చేశారు. గుత్తిలోని విద్యుత్ డీ ఈ కార్యాలయం వద్ద శనివారం సీపీఐ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్ చార్జీలను కూడా వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి రాజు, సీనియర్ నాయకులు రమేష్, మధు పాల్గొన్నారు.