సాలూరు: జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన పోరాం పాఠశాల విద్యార్థిని కావ్య
కర్నూలులో జరిగిన అండర్-17 రాష్ట్రస్థాయి పోటీల్లో హైజంప్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించిన తాడ్డి కావ్య, ఈ నెల 18 నుంచి 20 వరకు మధ్యప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమెకు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.