జనగాం: కరువు ప్రాంత రైతులకు గుడ్ న్యూస్: రుణాల చెల్లింపులో మినహాయింపులు, కలెక్టర్ ఆదేశాలు
జిల్లాలోని 4 కరువు మండలాల రైతులకు రుణాల పునర్నిర్మాణం, మొరటోరియం కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులను 45 రోజుల్లో గుర్తించి గడువు పొడిగింపు సౌకర్యం కల్పించాలని బ్యాంకర్లకు సూచించారు. అక్రమ వడ్డీ వసూళ్లపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు.