రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం హేవలాక్ వంతెన పర్యాటక కేంద్రంగా మార్పు: 42.86 కోట్లతో అభివృద్ధి పనులు
రాజమహేంద్రవరం హేవలాక్ వంతెనను 42.86 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయి పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ పనులను ఎమ్మెల్సీ సోము వీర్రాజు పరిశీలించారు. గ్లాస్ ఫ్లోరింగ్, ఫుడ్ కోర్టులు, బ్యాటరీ వాహనాలు వంటి అత్యాధునిక సౌకర్యాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.