హాజీపూర్: మంచిర్యాల: హాజీపూర్ పోలీస్ స్టేషన్లో డీసీపీ ఎ. భాస్కర్ ఆకస్మిక తనిఖీ
మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ హాజీపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తు, మత్తు పదార్థాల నిర్మూలన మరియు శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులకు పలు కీలక సూచనలు చేశారు. రాత్రి పెట్రోలింగ్ పెంచాలని ఆదేశించారు.