వనపర్తి: పదో తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత: పాఠశాలల్లో ప్రత్యేక తరగతులకు కలెక్టర్ ఆదేశం
కడుకుంట్ల జడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల మైదానాన్ని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.