మేడ్చల్: జవహర్ నగర్ డంపు యార్డు తొలగింపు కోసం ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర
జవహర్ నగర్ డంపు యార్డు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎంపీ ఈటల రాజేందర్ 60 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, డంపు యార్డును తొలగించే వరకు పోరాడుతామని, వరంగల్ నేషనల్ హైవేపై ఫ్లైఓవర్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.