హనుమకొండ: హన్మకొండలో జూదం ఆడుతూ పట్టుబడ్డ ఆరుగురు: నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం
హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జూదం ఆడుతున్న ఆరుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 5,080 రూపాయల నగదు, ప్లేయింగ్ కార్డులు, స్కోర్ షీట్ మరియు 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ క్రాంతి కుమార్ తెలిపారు.