వికారాబాద్: బూచనపల్లిలో రూ.20 లక్షల విలువైన సీసీ రోడ్డు పనులను ప్రారంభించి కాంగ్రెస్ మర్పల్లి మండల అధ్యక్షుడు రవీందర్
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కోట్లాది రూపాయలు మంజూరు చేసి గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం దోహదపడుతోందని కాంగ్రెస్ మర్పల్లి మండల అధ్యక్షుడు రవీందర్ అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన రూ.20 లక్షల నిధులతో బూచనపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించి ఆయన ఈ మేరకు మాట్లాడారు.