ఏలూరు అర్బన్: జిల్లా వ్యాప్తంగా స్కూలు బస్సులపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు 15 కేసులు నమోదు
Eluru Urban, Eluru | Aug 6, 2025
బుధవారం ఐదుగంటల ఏలూరు జిల్లా వ్యాప్తముగా మోటారు వాహనాల తనిఖీ అధికారులు విద్యా సంస్థల బస్సులను తనిఖీలు చేయడం ద్వారా వివిధ ఉల్లంఘనలకు గాను 15 కేసులు నమోదు చేసి, 26 వేల రూపాయలను అపరాధ రుసుముగా విధించినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. వాహనాలను నడిపే సమయములో వాహనదారులు లైసెన్స్ తో పాటుగా సంబంధిత వాహన పత్రాలను వాహనాలతో పాటుగా ఉంచుకోవాలని, రహదారి భద్రతా నియమాలను తప్పక పాటించాలన్నారు. రవాణా వాహనాలకు ఎప్పటికప్పుడు పన్ను చెల్లించడంతో పాటుగా వాహనానికి ఫిట్న్స్ చేయించాలని డీటీసీ కరీమ్ యాజమాన్యాలను కోరారు.