నర్సీపట్నం: నర్సీపట్నంలో వాహన తనిఖీలు: గంటలో 25 కేసులు నమోదు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎస్ఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు జరిగాయి. లైసెన్స్ లేకపోవడం, ట్రిపుల్ రైడింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనల కారణంగా గంటలో 25 కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన వారికి స్టేషన్లో కౌన్సెలింగ్ ఇస్తున్నారు.