ధర్మారం: దొంగతుర్తిలో పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి మాజీ మంత్రి ఈశ్వర్ పరామర్శ
ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు ఆకుల రాజయ్య గుండె పోటుతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.