అదిలాబాద్ అర్బన్: తక్కువ నీటితో ఎక్కువ లాభం.. గిరిజన రైతులకు ఐటీడీఏ పీఓ కీలక సూచనలు
గిరిజన రైతులు తక్కువ నీటితో అధిక ఆదాయం ఇచ్చే పంటలను సాగు చేయాలని ఉట్నూర్ ఐటీడీఏ పీఓ మంద మకరందు సూచించారు. ఉద్యాన పంటలు, అంతర పంటల సాగుతో పాటు ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ అంశాలపై చర్చించారు.