గద్వాల్: రాష్ట్రంలో దసరా పండగ సందర్భంగా అధిక చార్జీలు పెంచి ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం: జిల్లా కోఆర్డినేటర్ కురువపల్లయ్య
పండుగ పేరుతో బస్ చార్జీలు పెంచడం రేవంత్ రెడ్డి సర్కార్ కు సిగ్గుచేటు.ఇది ముమ్మాటికీ ప్రజా దోపిడీ పాలన, నయవంచన పాలన అని ఆదివారం సాయంత్రం BRSV రాష్ట్ర నాయకులు మరియు గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య.బస్సులకు స్పెషల్ స్టిక్కర్లు అతికించి అధిక చార్జీలు వసూలు చేస్తున్న దుర్మార్గం అయిన రేవంత్ రెడ్డి సర్కార్ అని ప్రజలకు పండగ సంతోషాన్ని లేకుండా చేయడమే ప్రజాపాలననా పండుగ వస్తే చాలు ఆర్టీసీ బస్సు చార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవడం సిగ్గుచేటు అని అన్నారు.