రామచంద్రాపురం: కొల్లూరులో కొత్త మోడల్ మార్కెట్: 5 ఎకరాల్లో నిర్మాణం
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ కొల్లూరులో 5 ఎకరాల విస్తీర్ణంలో మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సర్వే నంబర్ 203లో ఈ మార్కెట్ నిర్మాణం జరగనుంది. భూమి కేటాయింపు కోసం సర్వేను వేగంగా పూర్తి చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.