నిజామాబాద్ సౌత్: శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధనకు కృషి చేయాలి: నగరంలో ఆయన జయంతి వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధనకు కార్యకర్తలు కృషి చేయాలని నిజామాబాద్ అర్బన్ MLA ధన్పాల్ సూర్య నారాయణ పిలుపునిచ్చారు. ముఖర్జీ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. వేడుకలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహి ఛాలెంగే (ఒకే దేశానికి రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జాతీయ చిహ్నాలు ఉండకూడదు) అన్నారు