ఇల్లంతకుంట: కందికట్కూరు గ్రామం మొదలు నుండి మానేరు నది వరకు లైటింగ్ ఏర్పాటు..
కందికట్కూర్ గ్రామం మొదలు నుండి మానేరు నది వరకు లైటింగ్ ఏర్పాటు.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెలిశాల జ్యోతి కందికట్కూర్ గ్రామ కార్యదర్శికి సోమవారం మద్య్హనం సుమారు 100 వీధి దీపాలను, 4 హెవీ లైట్ల ను అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్నదే తన ఉద్దేశమని అన్నారు.గ్రామం మొదలయినా చోటు నుంచి మానేరు నది వరకు ఈ లైటింగ్ వ్యవస్థ ఉంటుందని అన్నారు.మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రజలకు సేవ చేయడమే తన బాధ్యత గా భావిస్తా