రేపు అనంతకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాక వైసిపి యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి
Anantapur Urban, Anantapur | Nov 5, 2025
గత 15 రోజుల నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా రేపు అనంతపురంలో యువజన విభాగం ఆధ్వర్యంలో స్థానిక సప్తగిరి సర్కిల్ లో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైసీపీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి వైసిపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి తో పాటు యువజన విభాగం నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొంటున్నట్లు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన మీడియాకు తెలిపారు.