పుంగనూరు: పుంగనూరులో పోలీస్ యాక్ట్-30 అమలు: నవంబర్ 30 వరకు ఆంక్షలు
పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్-30 అమలులో ఉంటుంది. సభలు, ర్యాలీలకు 48 గంటల ముందుగా పోలీసుల అనుమతి తప్పనిసరి అని సీఐ సుబ్బారాయుడు తెలిపారు. అంత్యక్రియలు, వివాహ ఊరేగింపులకు మినహాయింపు ఉంది.