గద్వాల్: మూగోనిపల్లిలో కిరాణా షాపులపై ఆకస్మిక తనిఖీలు: హానికరమైన చిరుతిళ్లపై సర్పంచ్ కుమారుడి హెచ్చరిక
జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం మూగోనిపల్లిలో సర్పంచ్ కుమారుడు కుర్వ పరుశరామ్ కిరాణా షాపులను తనిఖీ చేశారు. పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే కుర్కురేలు, ప్లాస్టిక్ వస్తువులు ఉన్న ప్యాకెట్లను విక్రయించవద్దని ఆయన షాపు యజమానులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.