
ఆర్ అండ్ ఆర్ యాక్టును పటిష్టంగా అమలు చేయండి
ఆరు నెలలు సమయం ఇవ్వాలని యాక్టులో ఉంది
లక్ష్మీపురం గ్రామాన్ని 24న ఖాలీ చేయిస్తే అడ్డుకుంటాం.. గిద్దలూరు వైయస్ఆర్సీపీ ఇన్ఛార్జీ. మాజీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి
మార్కాపురం
వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైతున్న కాకర్ల గ్యాప్ లోని మాగటూరు తాండలోని లక్ష్మీపురం, కృష్ణానగర్ గ్రామాల వారికి పూర్తి స్థాయిలో ఆర్ఆర్ ప్యాకేజి, పునరావాసం కల్పించి 6నెలల సమయం ఇచ్చి ఖాలీ చేయించాలని, అలా కాకుండా బలవంతంగా, దౌర్జన్యంగా కాళీ చేయిస్తే అడ్డుకుంటామని గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ, మాజీ ఎమ్మెల్యే కేపి నాగార్జునరెడ్డి హెచ్చరించారు. నిర్వసితులతో కలిసి ఆయన గురువారం కలెక్టర్ విజయసునీతను కలిశారు. నిర్వసితుల సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మిడియాతో మాట్లాడూతూ 2013 ఆర్ఆర్ యాక్టులోని 38వ క్లాజ్ ప్రకారం నిర్వాసితులందరికి నష్టపరిహారం ఇచ్చి 6నెలలు గడువు ఇవ్వాలని ఉందని, చట్ట ప్రకారం అధికారులు ముందుకు వెళ్ళాలన్నారు. ఈనెల 24న అధికారులందరూ ఆ గ్రామాలనికి వెళ్ళి ఎలాగైన కాలీ చేయిస్తామని చెపుతున్నారని, అలా చేస్తే తాము అడ్డుకుంటామని చెప్పారు. 2019లో నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కటాఫ్ తేదిని పెంచి నిర్వాసితులకు న్యాయం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం కూడా నీళ్ళు వదిలే తేదిని కటాఫ్ డేట్‌గా తీసుకుని ఆర్ఆర్ ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్ష్మీపురం గ్రామంలో సుమారు 500 ఎకరాలలో లక్షాలాధి రూపాయలు ఖర్చుపెట్టి పంటలు వేశారని, ఉన్న ఫలంగా కాలీ చేయమంటే వారి పరిస్థితి ఎంటన్నారు. ఈ గ్రామాలలో సుమారు 500 నుంచి 600 వరకు పశువులు ఉన్నాయని వారందరు ఇళ్ళను కాలిచేసి ఎక్కడ ఉండాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైన పునరాలోచించి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.