పామూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా
స్టేషన్లోని రికార్డులు, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతిపై ఆరా
పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి ఎస్పీ ఆదేశాలు
శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచన
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశం
చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచన
స్థానిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశం
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై నమ్మకం పెరిగేలా మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ సూచన