BREAKING NEWS LIVE #786MEDIA UR VOICE OUR REPORTS రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
టాలీవుడ్ ప్రముఖ సింగర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ వివాదంలో చిక్కుకున్నారు. విశాఖలో ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కర్పూరపు రాహుల్ రెడ్డి మోసం చేశాడని, అనంతరం తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశాడని యువతి ఆరోపించింది. ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్ తనను బెదిరించారని, బలవంతంగా వీడియో స్టేట్‌మెంట్లు ఇప్పించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
మొదట ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవగా, అనంతరం ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు సమాచారం. రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు పలువురిపై బెదిరింపులు, సైబర్ వేధింపులు తదితర ఆరోపణలపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.