ఉత్తమ ఉపాధ్యాయినికి కలెక్టర్ అభినందన..
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రం లో 10 వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన 10 పాఠశాలలను గుర్తించి ఆయా పాఠశాల లకు చెందిన ప్రధానోపాధ్యాయులకు అవార్డు లను అందజేసింది. అందులో భాగంగా మార్కాపురం జిల్లా అర్ధవీడు మండల కేంద్రం లోని జడ్పీ ఉన్నత పాఠశాల కు బెస్ట్ యావరేజ్ లో ఈ అవార్డు వరించింది. ఈ సందర్భంగా పాఠశాల ఉత్తమ ఫలితాల సాధనకు విశేష కృషి చేసిన అంధురాలైన ప్రధానోపాధ్యాయిని సుజాత దంపతులను ను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత కలెక్టరేట్ లోని ఆమె ఛాంబర్ లో ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా భవిష్యత్ లో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించి మరింత మందికి స్ఫూర్తి గా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో డీఈవో సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.