
BREAKING NEWS LIVE #786MEDIA UR VOICE OUR REPORTS *I&PR ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బి.శ్రీనివాసరావు.*
ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ (I&PR) డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, ఐఏఎస్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) నిర్వహిస్తున్న 11వ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ (AMPPP)లో పాల్గొనేందుకు వెళ్లనుండడంతో ఆయన నిర్వహిస్తోన్న శాఖలకు ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావును ఇన్‌ఛార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.తొలుత విశ్వనాథన్ నిర్వహిస్తున్న శాఖలకు ఇన్‌ఛార్జిగా 2020 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి మల్లవరపు సూర్యతేజకు పూర్తి అదనపు బాధ్యతలుగా (FAC) అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే ఈ రోజు ఈ ఉత్తర్వులను మారుస్తూ మరో జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.2018 బ్యాచ్‌కు చెందిన బి.శ్రీనివాసరావు తన శాఖలో ఉత్తమ పనితీరు కనపరుస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ ఆయన తన శాఖను ముందుకు తీసుకు వెళుతున్నారని, నెమ్మదస్తుడు,సమర్ధుడైన అధికారి అనే పేరు ఆయనకు ఉంది.ఎవరైనా తన వద్దకు ఏదైనా సమస్యతో వస్తే వారితో మర్యాదగా ప్రవర్తించి,వారి సమస్యలను పరిష్కరించడానికి,తనకు చేతనైన మేర సహాయం చేయడానికి ఆయన యత్నిస్తుంటారని ఎస్ఎస్ఏ శాఖ ఉద్యోగులు చెబుతుంటారు.