పలమనేరు: పుంగనూరు: ఎం.ఎస్. సలీంపై కేసును ఉపసంహరించుకోవాలని ముస్లిం మత పెద్దల డిమాండ్
పుంగనూరులో ఎన్నికల నామినేషన్ల ఘర్షణ కేసులో అంజుమన్ కమిటీ అధ్యక్షుడు ఎం.ఎస్. సలీం పేరును చేర్చడంపై ముస్లిం మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఘటన సమయంలో ఆయన అక్కడ లేరని పేర్కొంటూ, కేసును ఉపసంహరించుకోవాలని టీడీపీ ఇన్చార్జ్ మధుసూదన్ నాయుడును కోరారు.