మంచిర్యాల: అథ్లెటిక్స్ సెలక్షన్ పోటీలు ప్రారంభం
మంచిర్యాల ప్రభుత్వ కళాశాల మైదానంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్ సెలక్షన్ పోటీలు ప్రారంభమయ్యాయి. మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ ఈ పోటీలను ప్రారంభించారు. క్రీడల్లో విద్యార్థులు పట్టుదలతో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని మేయర్ ఆకాంక్షించారు.