నర్సీపట్నం: అమ్మపేటలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
గొలుగొండ మండలం అమ్మపేటలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేయడమే కాకుండా, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. నియోజకవర్గంలో రూ. 575 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.