అనంతపురం అర్బన్: వీలైనంతవరకు అరటి ధర తక్కువ కాకుండా చూడాలి : జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Nov 28, 2025
అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో జిల్లాలోని అరటి వ్యాపారస్తులు, ఎగుమతిదారులు, ఉద్యాన శాఖ అధికారులు, తదితరులతో ధర నియంత్రణపై జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వీలైనంతవరకు అరటి ధర తక్కువ కాకుండా చూడాలన్నారు. స్థానికంగా వ్యాపారులు అరటి కిలోకు 6 రూపాయలకు తగ్గకుండా రైతుల నుండి కొనుగోలు చేయాలని, ఎగుమతి దారులు ఇతర దేశాల మార్కెట్ కు కిలో 8 రూపాయలకి తగ్గకుండా కొనుగోలు చేసి ఎగుమతి చేయాలని సూచించారు. జిల్లాలో అరటిపంట నాణ్యత పెంచడం ద్వారా ఎగుమతులు మొదలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.