నల్గొండ: 41వ రోజుకు చేరిన బీసీ రాజ్యాధికార యాత్ర: మునుగోడులో తీన్మార్ మల్లన్న పాదయాత్ర
బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నల్లగొండ నుంచి మునుగోడు వరకు పాదయాత్ర చేస్తున్నారు. కంచనపల్లిలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, బంగారు మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతోందని తెలిపారు.