ఒంగోలు అర్బన్: కొత్తపట్నం మండలం శ్రీహరిపురం గ్రామంలోని సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు
Ongole Urban, Prakasam | Oct 14, 2026
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం శ్రీహరిపురం గ్రామంలో బుధవారం సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హాజరయ్యారు. కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యేను గ్రామస్తులు శాలువా పూలమాలతో సన్మానించారు. గ్రామస్తులు అందరు కలిసి చక్కటి ఆలయం నిర్మించుకున్నారని గ్రామస్తులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.