కాకినాడ సిటీ: కాకినాడలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
కాకినాడలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 61 లక్షల మందికి, కాకినాడలో 28,544 మందికి పింఛన్లు అందజేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.