మార్కాపురం: ఏ ఈ ఆర్ ప్రణాళిక పై సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
అమరావతి ఎకనామిక్ రీజియన్ ప్రణాళికలో భాగంగా మార్కాపురం జిల్లాకు సంబంధించి సమగ్ర అభివృద్ధి ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ విజయ సునీత అధికారులు ఆదేశించారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఏఈఆర్ వర్క్ షాప్ లో కలెక్టర్ పాల్గొని వివిధ శాఖల అధికారులతో జిల్లాలోని అభివృద్ధి అవకాశాలు భవిష్యత్తు అవసరాలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అందుబాటులో ఉన్న సహజ వనరులు మౌలిక పరిస్థితులు వ్యవసాయ ఉద్యానవన పారిశ్రామిక పర్యాటక రంగాలలో ఉన్న అవకాశాలను సమగ్రంగా గుర్తించాలని సూచించారు.