మణుగూరు: చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వృద్ధుడు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ముత్యాలమ్మ నగర్ లోని ఐతేనకుంట చెరువులో ఆదివారం చేపల వేటకు వెళ్లిన బోధనగడ్డ వెంకటేశ్వర్లు (65) ప్రమాదవశాత్తు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.