మాసాయిపేట: మాసాయిపేటలో కల్లు సరఫరా నిలిపివేత: ఆగ్రహంతో ఆందోళనకు దిగిన గ్రామస్థులు
మాసాయిపేటలో కల్లు సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. కొత్త యజమానులు కల్లు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. నాణ్యమైన కల్లు సరఫరా చేయాలని, రసాయనాలు లేని దుకాణాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు.