ఒంగోలు అర్బన్: నిద్రిస్తున్న వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన గుర్తు తెలియని వ్యక్తులు
Ongole Urban, Prakasam | Aug 20, 2026
ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చీమకుర్తి మండలం బక్కిరెడ్డిపాలెంలో తిరుపతయ్య అనే 61ఏళ్ళ వృద్ధుడిపై ఇద్దరు దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తిరుపతయ్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన తిరుపతయ్యను ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ మణిపాల్ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత కక్షల నేపధ్యంలోనే ఈ దారుణం జరిగిండచ్చని స్ధానికులు చెప్తున్న పరిస్థితి. ఘటన పై కేసు నమోదు చేసిన చీమకుర్తి పోలీసులు విచారణ చేపట్టారు.