ఈజీ మనికి అలవాటు పడి యువకులు మోసపోవద్దని ASF ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మంగళవారం ASF జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎవరైనా మొబైల్ పోన్ లో బెట్టింగ్ యాప్ లు ఇంస్టాల్ చేసి ఉంటే వారిపైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బెట్టింగ్ యాప్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మీరు మోసపోతారని, అలాంటి ఫేక్ యాప్ ను యువకులు నమ్మి మోసపోవద్దని సూచించారు.