ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని మంగమూరు జంక్షన్ వద్ద విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి, దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు
Ongole Urban, Prakasam | Oct 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మంగమూరు జంక్షన్ వద్ద విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు. 11 కెవి విద్యుత్ వైర్ తగిలి మోహన్ పూర్ బింద్ అనే వ్యక్తి మృతి చెందాడు. అంతకుముందు విద్యుత్తు షాక్ తగిలి స్పృహ కోల్పోయిన మృతుడిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు విద్యుత్ షాక్ గురైన వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.